గుడ్‌న్యూస్.. నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బుల జమ
సీఎం వైఎస్ నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
By అంజి Published on 20 Feb 2024 1:08 AM GMTగుడ్‌న్యూస్.. నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా డబ్బుల జమ
సీఎం వైఎస్ నేడు కళ్యాణమస్తు, షాదీ తోఫా సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ఏడాది అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో పెళ్లీ చేసుకున్న 10,132 అర్హులైన జంటలకు నిధులు విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి బటన్ నొక్కి రూ.78.53 కోట్లు జమ చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ పథకాల కింద రూ.56,194 మందికి రూ.427 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు 'వైఎస్సార్ కళ్యాణమస్తు' స్కీమ్ ద్వారా ఆర్ధిక సాయం అందిస్తోంది. మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు 'షాదీ తోఫా' స్కీమ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫాలకు టెన్త్ క్లాస్ ఉత్తీర్ణతతో పాటు, వధువు వయసు 18 ఏళ్ళుగా వరునికి 21 ఏళ్ళుగా నిర్ధేశించారు. చిన్నారులు పదో తరగతికి వచ్చే సరికి వారికి 15 ఏళ్ళ వయసు వస్తుంది. ప్రభుత్వం 1 వ తరగతి నుండి అప్పటికే ఏటా అందిస్తున్న రూ. 15,000 జగనన్న అమ్మ ఒడి సాయం ఇంటర్ వరకూ కూడా ఇస్తుండటంతో వారికి 17 ఏళ్ళ వయస్సు వచ్చే సరికి వారి ఇంటర్ చదువు కూడా పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.