నేడు 'జగనన్న చేదోడు పథకం' నిధుల విడుదల

CM Jagan will distribute money under the Jagananna Chedodu scheme today. ఏపీ: జగనన్న చేదోడు పథకం 3వ విడత సాయం నేడు లబ్ధిదారుల ఖాతాలో జమకానుంది.

By అంజి  Published on  30 Jan 2023 7:15 AM IST
నేడు జగనన్న చేదోడు పథకం నిధుల విడుదల

ఏపీ: జగనన్న చేదోడు పథకం 3వ విడత సాయం నేడు లబ్ధిదారుల ఖాతాలో జమకానుంది. రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ కానుకను అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ. 330.15 కోట్ల ఆర్ధిక సాయాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో నేడు బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్‌ జమ చేయనున్నారు.

జగనన్న చేదోడు - షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ. 10 వేల చొప్పున నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటికే ఒక్కొక్కరికి రూ. 30,000 ఆర్ధిక సాయాన్ని వైసీపీ ప్రభుత్వం అందించింది. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఈ మూడేళ్ళలో కేవలం ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సాయం రూ. 927.39 కోట్లు అందించింది.

లంచాలకు, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్‌ప్లే చేసి, సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక, ప్రతి ఒక్కరికీ అర్హత ఉంటే మిస్‌ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయం చేస్తోంది. అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్‌లలో లబ్ధిని జగన్‌ ప్రభుత్వం అందజేస్తోంది.

షాపులున్న 1,67,951 మంది టైలర్లకు రూ. 167.95 కోట్ల లబ్ధి

షాపులున్న 1,14,661 మంది రజకులకు రూ. 114.67 కోట్ల లబ్ధి

షాపులున్న 47,533 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 47.53 కోట్ల లబ్ధి

జగనన్న చేదోడు పథకం క్రింద ఇప్పటివరకు అందించిన లబ్ధి

2020 – 21లో లబ్ధిదారుల సంఖ్య 2,98,122 సాయం రూ. 298.12 కోట్లు

2021 – 22లో లబ్ధిదారుల సంఖ్య 2,99,116 సాయం రూ. 299.12 కోట్లు

2022 – 23లో లబ్ధిదారుల సంఖ్య 3,30,145 సాయం రూ. 330.15 కోట్లు

మొత్తం రూ. 927.39 కోట్లు.

Next Story