కలిసొచ్చిన చోటు నుండే.. వైసీపీ అభ్యర్థుల ప్రకటనకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మిగిలిన పార్టీలకంటే ముందుగా వైసీపీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  13 March 2024 3:07 PM IST
కలిసొచ్చిన చోటు నుండే.. వైసీపీ అభ్యర్థుల ప్రకటనకు సర్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మిగిలిన పార్టీలకంటే ముందుగా వైసీపీ సన్నద్ధమైన సంగతి తెలిసిందే. ఓ వైపు సిద్ధం సభను గ్రాండ్ సక్సెస్ అయిందన్న ఉత్సాహంతో క్యాడర్ ఉండగా.. ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గాలకు తగ్గట్టుగా సమన్వయకర్తలను మారుస్తూ వెళుతున్నారు. శాసన సభ స్థానాలకు, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సమన్వయకర్తల విషయంలో చాలా నిర్ణయాలనే తీసుకుంది వైసీపీ. ఇక అభ్యర్థుల తుది ప్రకటనకు వైసీపీ సిద్ధమవుతోంది.

ఈ నెల 16వ తేదీన వైస్సార్‌ జిల్లా ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. వైఎస్సార్‌ ఘాట్‌ వేదికగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఆయనే స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించారు. కలిసొచ్చిన చోటు నుండే మరోసారి అభ్యర్థుల ప్రకటన ఉండనుంది. మార్చి 16వ తేదీ నాటి ప్రకటన అనంతరం సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Next Story