ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పింది: సీఎం జగన్‌

రాయి దాడి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొదటిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి దగ్గర తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో మాట్లాడారు.

By అంజి  Published on  15 April 2024 1:45 PM IST
CM Jagan, stone attack, APnews

ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం తప్పింది: సీఎం జగన్‌

రాయి దాడి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొదటిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి దగ్గర తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో మాట్లాడారు. డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఒక్కరోజు విరామం అనంతరం నేటి ఉదయం మేమంతా సిద్ధం యాత్రను ప్రారంభించారు. అయితే యాత్ర ప్రారంభానికి ముందే కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లా నేతలు సీఎం జగన్‌ను కలిసి పరామర్శించారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం తప్పిందన్నారు. మరోసారి అధికారంలోకి వస్తున్నాం.. ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.

ఎలాంటి దాడులూ తనను ఆపలేవని, ధైర్యంతో ముందడుగు వేద్దామని పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్‌ ధైర్యం చెప్పారు. వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, బస్సు యాత్రకు వస్తున్న విశేష ఆదరణను చూసే ఈ దాడికి పాల్పడ్డారని సీఎం జగన్‌ దృష్టికి వైసీపీ నేతలు తీసుకెళ్లారు. శనివారం నాడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎవరో రాళ్లతో దాడి చేయడంతో గాయపడ్డారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో రాయి తగలడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అధినేత ఎడమ కనుబొమ్మపై గాయమైంది. వైద్యులు వెంటనే అతనికి ప్రథమ చికిత్స అందించారు.

Next Story