నేడు క‌డ‌ప‌, విశాఖ జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

CM Jagan visits Kadapa and Vizag Districts Today.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు(ఆదివారం) క‌డ‌ప‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Feb 2022 8:21 AM IST
నేడు క‌డ‌ప‌, విశాఖ జిల్లాల్లో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు(ఆదివారం) క‌డ‌ప‌, విశాఖ జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ముందుగా క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టించి అక్కడ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌నున్నారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్క‌డి నుంచి ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం క‌డ‌ప‌కు చేరుకోనున్నారు. అక్కడ పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇనిస్టిట్యూట్ ప్రారంభోత్సవంలో పాల్గొన‌నున్నారు. అనంత‌రం జయరాజ్‌ గార్డెన్స్‌లో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించ‌నున్నారు. ఆ త‌రువాత తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

సాయంత్రం సీఎం ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని సీఎంవో వ‌ర్గాలు తెలిపాయి. సాయంత్రం 4.45 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేవల్‌ ఎయిర్‌స్టేషన్, ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలుకుతారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అక్కడ కార్యక్రమం ముగిశాక రాత్రి 7 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. సీఎం, రాష్ట్ర‌ప‌తి విశాఖ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో పోలీసులు భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.

Next Story