అస‌ని తుఫాన్ ప‌రిస్థితుల‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. ప‌లు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

CM Jagan Review meeting on Asani Cyclone Situations.అస‌ని తుఫాన్ ప్ర‌భావిత జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారుల‌తో సీఎం జ‌గ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2022 12:52 PM IST
అస‌ని తుఫాన్ ప‌రిస్థితుల‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. ప‌లు జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

అస‌ని తుఫాన్ ప్ర‌భావిత జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారుల‌తో సీఎం జ‌గ‌న్ వీడియో కాన్ఫ‌రెన్స్ చేప‌ట్టారు. అస‌ని తుఫాన్ ప‌రిస్థితుల‌పై, చేప‌ట్టిన స‌హాయక చ‌ర్య‌ల‌పై సీఎం స‌మీక్ష జ‌రుపుతున్నారు. తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల‌లో తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారులకు ముఖ్య‌మంత్రి దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను జిల్లాలకు పంపించిందని అన్నారు. తుఫాన్ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

తుఫాన్ బాధితుల ప‌ట్ల మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని అదికారుల‌కు సీఎం జ‌గ‌న్ సూచించారు. ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కుత‌ర‌లించాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైన చోట స‌హాయ‌పున‌రావాస శిబిరాల‌ను తెర‌వాల‌న్నారు. ప‌రిహారం ఇచ్చే విష‌యంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవ‌ద‌న్నారు. స‌హాయ శిబిరాల‌కు త‌ర‌లించిన వ్య‌క్తి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.రెండు వేలు చొప్పున ఇవ్వాల‌న్నారు. స‌హాయ శిబిరాల్లో అన్నిసౌక‌ర్యాలు క‌ల్పించాల‌న్నారు. సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలని తెలిపారు. ఈ నంబర్లకు బాగా ప్రచారం కల్పించాలని సీఎం చెప్పారు.

అస‌లి తుఫాన్ ప్ర‌భావంతో మ‌చిలీప‌ట్నం,కాకినాడ‌, విశాఖ‌ప‌ట్నం, గంగ‌వ‌రం, భీముని ప‌ట్నం పోర్టుల్లో అధికారులు 7వ మిగిలిన పోర్టుల్లో 5వ నెంబ‌ర్ ప్ర‌మాద హెచ్చ‌రికల‌ను అధికారులు జారీ చేశారు.

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే..

కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్ 18004253077

కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 0884-2368100

శ్రీకాకుళం 08942-240557

తూర్పు గోదావరి 8885425365

ఏలూరు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్ 18002331077

విజయనగరం 08922-236947

పార్వతీపురం మన్యం 7286881293

మచిలీపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08672 252572

మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్ 08672 252486

బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 8712655878, 8712655881

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 90103 13920

విశాఖ 0891-2590100,102

అనకాపల్లి - 7730939383


Next Story