రైతుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం : సీఎం జ‌గ‌న్‌

CM Jagan release Rs 542crore crop loss subsidy to farmers.రైతుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామ‌ని సీఎం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Feb 2022 1:25 PM IST
రైతుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం : సీఎం జ‌గ‌న్‌

రైతుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతుల‌కు ఇన్‌పుట్ స‌బ్బిడీ మొత్తాన్ని మంగ‌ళ‌వారం సీఎం జ‌గ‌న్ విడుద‌ల చేశారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధుల‌ను జ‌మ చేశారు. 5,97,311 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.542.06 కోట్ల‌ను జ‌మ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, శంకరనారాయణ, ఏపీ అగ్రికల్చర్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. రైతన్నలకు అన్ని విధాలా అండగా ఉంటున్న‌ట్లు చెప్పారు. ఏ సీజ‌న్‌లో న‌ష్ట‌పోయిన రైతుల‌కు అదే సీజ‌న్‌లో ప‌రిహారం అందిస్తున్న‌ట్లు తెలిపారు. అర్హులంద‌రికీ ప‌రిహారం అందిస్తున్నామ‌ని, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామ‌న్నారు. గ్రామీణ స్థాయుల్లో ఆర్బీకే కేంద్రాల్లో లబ్ధిదారుల జాబితా డిస్‌ప్లే చేస్తున్నట్లు వివ‌రించారు. 2021 న‌వంబ‌ర్‌లో వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌కు రైతులు పంట న‌ష్ట‌పోయారు. 5,97,311 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్ స‌బ్సిడీ ఇస్తున్నాం. 1,220 రైతు గ్రూపుల‌కు యంత్ర సేవా ప‌థ‌కం కింద రూ.29.51 కోట్ల ల‌బ్ధిచేకూరింది. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1,612 కోట్ల సాయం అందించాం. రాష్ట్రంలో 18.70 లక్షల మంది రైతులకు పగటిపూట‌ నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు.

యంత్ర సేవా ప‌థ‌కం ద్వారా రైతుల‌ను ప్రోత్స‌హిస్తున్నాం. గ‌త ప్ర‌భుత్వం ఇన్‌పుట్ స‌బ్బీడీ స‌రిగా ఇవ్వ‌లేదు. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక సమృద్దిగా వ‌ర్షాలు ప‌డ్డాయి. రాయలసీమలో గ్రౌండ్‌ వాటర్‌ పెరిగింది. ఏపీలో అన్ని ప్రాంతాలు జలాశయాలతో కళకళ లాడుతున్నాయి అని సీఎం అన్నారు.

Next Story