నష్టపోయాం.. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామిక అభివృద్ది.. సీఎం జగన్
CM Jagan participated Niti Aayog meeting.విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని..
By తోట వంశీ కుమార్ Published on 20 Feb 2021 2:30 PM ISTవిభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామికాభివృద్దిలో ముందుకు దూసుకెలుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 6వ నీతి అయోగ్ పాలకమండలి సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ భేటిలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి అయోగ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు విషయాలను ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతంగా సాధిస్తుందని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ నష్టపోయిందన్నారు.
విభజనకు ముందు ఏపీకి ప్ర్యతేక ఇస్తామని.. అప్పట్లో పార్లమెంటులో ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలపై ఏపీ సర్కారు ఏడాదికి 10 నుంచి 11 శాతం వడ్డీలను చెల్లించాల్సి వస్తుందన్నారు. తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3శాతానికి మించి ఉండటం లేదన్నారు. అలాగే, రుణాలపై అధిక వడ్డీలతో పాటు విద్యుత్ ఖర్చులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారంగా మారాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సంస్కరణల విషయంలో ఏపీ సర్కారు సమర్థంగా పనిచేస్తోందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 5 రకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుందన్నారు. పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించాలని నాణ్యమైన విత్తనాలు, సర్టిపై చేసిన ఎరువులు, పురుగుల మందులను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందన్నారు.