కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సీఎం జ‌గ‌న్ భేటీ.. ముగిసిన‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న

CM Jagan meets Union Minister Nitin Gadkari.కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2022 6:59 AM GMT
కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సీఎం జ‌గ‌న్ భేటీ.. ముగిసిన‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న

కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి నివాసంలో వీరిద్ద‌రి మ‌ధ్య 15 నిమిషాల పాటు భేటి కొన‌సాగింది. ర‌హ‌దారుల నిర్మాణాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, వాటికి నిధులను విడుదల చేయాలని కోరారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.

విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతో పాటు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలి. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరు చేయాల‌ని కోరారు.

సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. గ‌డ్క‌రీకి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ వేంక‌టేశ్వ‌ర స్వామి చిత్రప‌టాన్ని అందించారు. నితిన్ గ‌డ్క‌రీతో స‌మావేశం అనంత‌రం సీఎం జగన్‌ ఢిల్లీ విమానశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలు దేరారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్య‌మంత్రి జగన్‌ నిన్న(మంగ‌ళ‌వారం) ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఏపీని ఆర్థికంగా సహాయం అందించాలని, పోలవరం ప్రాజెక్టుకు సంవరించిన అంచనాలు, రేషన్‌ పెంపుదల, భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతులు తదితర అంశాలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు.

Next Story