ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జ‌గ‌న్ సమావేశం

CM Jagan meet with PM Modi.ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ భేటీ ముగిసింది. సాయంత్రం 4.30

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Jun 2022 6:16 PM IST
ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జ‌గ‌న్ సమావేశం

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ భేటీ ముగిసింది. సాయంత్రం 4.30 గంట‌ల‌కు ప్ర‌ధానితో జ‌గ‌న్ స‌మావేశం అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు వీరిద్ద‌రి మ‌ధ్య భేటీ జ‌రిగింది. ఈ స‌మావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు పెండింగ్ అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి ఎన్నిక‌పైనా వీరిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు.

ప్ర‌ధానితో స‌మావేశం అనంత‌రం సీఎం జ‌గ‌న్ ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో భేటీ కోసం వెళ్లారు. నిర్మ‌లా సీతారామ‌న్ భేటీ ముగిసిన త‌రువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తోనూ జ‌గ‌న్ భేటీ అయ్యే అవ‌కాశాలున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. జ‌గ‌న్, అమిత్ షా ల మ‌ధ్య రాత్రి 9 గంట‌ల త‌రువాత జ‌రిగే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.

Next Story