భోగాపురం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
ఉత్తరాంధ్రకు ప్రయోజనం చేకూర్చే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్
By అంజి Published on 3 May 2023 7:30 AM GMTభోగాపురం ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
ఏపీ: ఉత్తరాంధ్రకు ప్రయోజనం చేకూర్చే భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ భూమి పూజ చేశారు. మూడేళ్లలో తొలి దశ నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ ఎయిర్‌పోర్టు పనులను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు తీడ్రి మోడల్‌ను పరిశీలించారు. అనంతరం భోగాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ మాట్లాడారు. 2026లో తానే ఎయిర్ పోర్టును ప్రారంభిస్తానని జగన్ స్ధానికులకు హామీ ఇచ్చారు. భోగాపురం ఎయిర్ పోర్టుతో పాటు చింతపల్లి ఫిష్ లాండింగ్ సెంటర్, వైజాగ్ టెక్ పార్క్, డేటా సెంటర్, రిక్రియేషన్ సెంటర్లకు శంకుస్థాపనకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో 2,203.26 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ విమానాశ్రయం మొదటి దశను రూ.4,592 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. తొలిదశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణించేలా నిర్మాణం జరిపి... తర్వాత ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా అభివృద్ధి చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మించాలని ప్లాన్ చేయడంతో, 2024 డిసెంబర్ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ నిర్మాణంతో లక్షలాది మందికి ఉపాధి దొరకనుంది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీనిని నిర్మిస్తోంది.