ఆనందయ్య మందుపై సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

CM Jagan Key Decision On Anandaiah Medicine. ఆనంద‌య్య‌ ఆయుర్వేద మందు పంపిణీ అంశంపై సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మందు శాస్త్రీయ‌త‌, ప‌నిచేసే విధానాన్ని తెలుసుకోవాల‌ని సీఎం అధికారులను ఆదేశించారు.

By Medi Samrat  Published on  21 May 2021 2:07 PM IST
CM Jagan about anandaiah medicine

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన‌ ఆనందయ్య అనే వ్యక్తి క‌రోనాకు ఆయుర్వేద మందు ఇస్తున్నార‌న్న విష‌యం తెలిసిందే. ఆ మందు అద్భుతంగా పనిచేస్తోందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మందు తీసుకున్న వారు తమకు కరోనా నుంచి విముక్తి కలిగినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణపట్నానికి జనం పోటెత్తుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆనంద‌య్య‌ ఆయుర్వేద మందు పంపిణీ అంశంపై సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయుర్వేద మందు శాస్త్రీయ‌త‌, ప‌నిచేసే విధానాన్ని తెలుసుకోవాల‌ని సీఎం అధికారులను ఆదేశించారు. కేంద్ర‌ప్ర‌భుత్వ ఆరోగ్య‌ విభాగాల‌తో ప‌రీక్ష‌లు చేయించాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు ఐసీఎంఆర్ బృందం ఈ రోజు సాయంత్రానికి నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఈ మందు పంపిణీపై ప‌ర్యాట‌క‌ బృందం నుండి అనుమతి వ‌స్తే ప్ర‌భుత్వ ప‌రంగా చేయాల్సిన ఏర్పాట్ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవకాశం ఉంది.

ఇదిలావుంటే.. ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందు పంపిణీ ప్రాంతం వద్ద పరిస్థితి అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టతరంగా మారుతోంది ప్రస్తుతం అక్కడ 5 వేల మందికి మందు తయారు చేసినప్పటికీ.. అక్కడ ఉన్న జనం 35 వేల మందికి పైగానే ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. అంబులెన్స్ లు 2 వేలు వరుసగా ఉన్నాయని తెలుస్తోంది. ఆనంద్ ఆయుర్వేద మందు పంపిణీ వద్ద గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఒక్కసారిగా వేల మంది రావడంతో గందరగోళం నెలకొంది. కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి చివరకు మీడియా వాహనాలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని పోయాయి. కృష్ణపట్నం లోకి వందలాది సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. పోలీసులు భారీ సంఖ్యలో అడుగడుగున చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కృష్ణపట్నం లో కి బయట వ్యక్తులను రాకుండా పోలీసులు నియంత్రణలో తీసుకుంటున్నారు.


Next Story