మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

CM Jagan key comments on AP Cabinet Expansion.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కేబినేట్ విస్త‌ర‌ణ పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2022 3:33 PM IST
మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కేబినేట్ విస్త‌ర‌ణ పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని సీఎం తెలిపారు. బ‌డ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు కేబినేట్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. చాలా మంది పోటీలో ఉన్నార‌న్నారు. మంత్రి వ‌ర్గంలో స్థానం లేనంత మాత్రానా వారిని ప‌క్క‌న పెట్టిన‌ట్లు కాద‌న్నారు. మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించిన వారు పార్టీ కోసం ప‌ని చేయాల‌ని సూచించారు. కొంద‌రికి జిల్లా ఇంచార్జ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నున్న‌ట్లు తెలిపారు. పార్టీని గెలిపించుకుని వ‌స్తే మ‌ళ్లీ మంత్రులు కావొచ్చున‌న్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో కొంద‌రిని మాత్ర‌మే కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. ఈ నేపథ్యంలో కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరనీ తొలగిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వార్షిక(2022-23) బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.2,56,257 కోట్లతో బడ్జెట్‌ను అసెంబ్లీ ముందుంచారు. రెవెన్యూ వ్యయం రూ.2,08,261 కోట్లు, మూలధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లుగా, ద్రవ్య లోటు రూ.48,724 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 1.27 శాతం, జీఎస్డీపీలో ద్రవ్య లోటు 3.64 శాతంగా వెల్ల‌డించారు. కాగా..వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగో సారి బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టారు.

Next Story