14 వైద్యకళాశాలలకు సీఎం జగన్ శంకుస్థాపన
CM Jagan Inagurates Medicla colleges works.ఏపీలో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ సోమవారం
By తోట వంశీ కుమార్ Published on 31 May 2021 1:17 PM ISTఏపీలో కొత్తగా 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైద్య కళాశాలల కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. వీటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో మొత్తం 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా ఇప్పటికే పులివెందుల, పాడేరు కళాశాల పనులు ప్రారంభమయ్యాయి. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 176 పీహెచ్‌సీలకు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మండలానికి కనీసం రెండు పీహెచ్‌సీలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గిరిజనులకు రూ.246 కోట్లతో ఐదు గిరిజన ఆస్పత్రులు నిర్మిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పరిధిలోకి 2,436 వైద్య చికిత్సలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,111 విలేజ్, 560 అర్భన్ క్లినక్‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.