జిత్తులు, ఎత్తులు, పొత్తులనే చంద్రబాబు నమ్ముకున్నారు:సీఎం జగన్
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి ధ్వజమెత్తారు. 14 ఏళ్లపాటు సీఎంగా ఉండి చంద్రబాబు
By Srikanth Gundamalla Published on 16 Jun 2023 8:35 AM GMTజిత్తులు, ఎత్తులు, పొత్తులనే చంద్రబాబు నమ్ముకున్నారు:సీఎం జగన్
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి ధ్వజమెత్తారు. 14 ఏళ్లపాటు సీఎంగా ఉండి చంద్రబాబు ప్రజలకు ఏం చేయలేదని ఆరోపించారు. గుడివాడలో టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. టీడీపీ పెత్తందారుల పార్టీ అని.. పేదల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. అందుకే ప్రజలు టీడీపీని దూరం పెట్టారని అన్నారు సీఎం జగన్.
రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే కులా సమతౌల్యం దెబ్బతింటుందని చంద్రబాబు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. పేదవాడికి చంద్రబాబు నాయుడు ఏనాడూ సెంటు స్థలం ఇచ్చింది లేదన్నారు. చంద్రబాబు మూడుసార్లు సీఎం అయినా టిడ్కో ఇళ్లను కట్టలేకపోయారని సీఎం జగన్ విమర్శించారు. టిడ్కో ఇల్లు కావాలంటే డబ్బులు కట్టాల్సి వచ్చేది అన్నారు. కానీ.. వైసీపీ ప్రభుత్వం ఇళ్లను కట్టించడమే కాదు.. రిజిస్ట్రేషన్ చేసి మరీ పేదలకు పంపిణీ చేస్తోందని చెప్పారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే కుప్పంలో ఇల్లు కట్టుకుంటానని చెబుతున్నారు.. ఎన్నికలు అవ్వగానే అక్కడ అస్సలు ఉండని అన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆరోపించారు సీఎం జగన్. ఒక్కసారి చాన్స్ ఇవ్వండి అని పదే పదే అడుగుతున్న చంద్రబాబు 14 ఏళ్లో ఎందుకు ఏం చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు. ఇన్నేళ్లలో చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని అన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనించాలని ఏపీ సీఎం జగన్ కోరారు.
చంద్రబాబు జిత్తులు, ఎత్తులు, పొత్తులనే నమ్ముకుఆన్నారు. రెండు పక్కలా రెండు పార్టీలు లేకుంటే చంద్రబాబు నిలబడలేరని విమర్శించారు. చంద్రబాబు వెనుక దొంగల ముఠా ఉందని.. ఆయన వెనకుండి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. 175 సీట్లలో అభ్యర్థులను కూడా నిలబట్టలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు కోసమే జీవితమని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అవుతానని మురిసిపోతున్నారని అన్నారు. వీళ్లేం ప్రత్యర్థులంటూ సీఎం జగన్ ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డారు.