ఆర్-5 జోన్‌లో.. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్
గుంటూరులోని తుళ్లూరు వెంకటపాలెంలో ఆర్-5 మండలంలో నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
By అంజి Published on 26 May 2023 8:30 AM GMTఆర్-5 జోన్‌లో.. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్
గుంటూరులోని తుళ్లూరు వెంకటపాలెంలో ఆర్-5 మండలంలో నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఇంటి స్థలం పట్టాలను పంపిణీ చేశారు. 1402 ఎకరాల్లో 25 లేఅవుట్లలో 50 వేల మందికి పైగా పేదలకు ముఖ్యమంత్రి పట్టాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. న్యాయపరమైన అడ్డంకులన్నింటినీ అధిగమించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని, పేదల విజయంగా అభివర్ణించారు. లబ్ధిదారులంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేశామని, మరికొద్ది రోజుల్లో జియో ట్యాగింగ్ పూర్తవుతుందని చెప్పారు.
అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్దిదారులకు మూడు ఆప్షన్లు ఇస్తామన్నారు. మొదటి ఆప్షన్‌గా ఇళ్లు కట్టుకుంటామంటే.. పేదలకు బ్యాంకు ఖాతాల్లో రూ.1.80 లక్షలు వేస్తామని, రెండో ఆప్షన్‌లో నిర్మాణ కూలీల మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసి ఇసుక, స్టీలు, సిమెంట్, డోర్ ఫ్రేమ్‌లను సబ్సిడీపై ఉచితంగా అందజేస్తుందని అన్నారు. మెటీరియల్ నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం జగన్ ప్రకటించారు. ఇక మూడో ఆప్షన్‌గా.. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలని అడిగితే చిరునవ్వుతో స్వీకరించి ఇల్లు కట్టి ఇస్తామన్నారు. ఇందులో అక్కా చెల్లెమ్మలు ఏ ఆప్షన్ తీసుకున్నా పర్వలేదన్నారు.