నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌

CM Jagan Delhi Tour today.ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(శుక్ర‌వారం) ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2022 9:49 AM IST
నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌

ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(శుక్ర‌వారం) ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. మ‌ధ్యాహ్నాం 3.30 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయ‌లుదేర‌నున్నారు. రాత్రికి అక్క‌డే బ‌స చేయ‌నున్నారు. శ‌నివారం జరగనున్న జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ సదస్సులో పాల్గొంటారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో సీఎం జ‌గ‌న్ వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌తో స‌మావేశం కానున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను కూడా క‌లిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మూడు వారాల క్రితం రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సీఎం జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీతో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి ప్ర‌ధానితో స‌మావేశం కానుండ‌డంతో ఈ ప‌ర్య‌ట‌న‌పై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఈసారి ప్రధానితో భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి తోడ్పాటు అవకాశంపై చర్చించే అవ‌కాశం ఉంది.

Next Story