గుకేష్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్.. తెలుగు - తమిళుల మధ్య మాటల యుద్ధం
వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌ను తమిళులు ఖండిస్తున్నారు.
By అంజి Published on 13 Dec 2024 6:50 AM GMTగుకేష్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్.. తెలుగు - తమిళుల మధ్య మాటల యుద్ధం
వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్ దొమ్మరాజుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్‌ను తమిళులు ఖండిస్తున్నారు. గుకేష్ తెలుగు వ్యక్తి అని అనడం సరికాదని, గుకేష్ తమిళుడని కామెంట్స్ చేస్తున్నారు. వారికి కౌంటర్‌గా ఆయన వికీపీడియాను షేర్ చేస్తూ మావేడనని తెలుగు వాళ్లు అంటున్నారు. దీంతో చంద్రబాబు ట్వీట్ కింద తమిళ - తెలుగు నెటిజన్ల మాటల యుద్ధం జరుగుతోంది. కాగా గుకేష్ చెన్నైకి చెందిన తెలుగువారని చాలా సైట్లు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే.. వరల్డ్ ఛాంపియన్ అయిన భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గుకేష్ తనకు 10 ఏళ్లు ఉన్నప్పుడే వరల్డ్ చెస్ ఛాంపియన్ అవుతానని సవాల్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అప్పుడు చెప్పిట్టే ఎంతో శ్రమించి అతి చిన్న వయసులో ప్రపంచ విజేతగా నిలిచారని నెటిజన్లు కొనియాడుతున్నారు. లక్ష్యాన్ని నిర్ణయించుకుని, దానిని చేరుకునేందుకు రేయింబవళ్లు శ్రమిస్తే విజయం మనదేనని గుకేష్ నిరూపించారు.
ఛాంపియన్‌షిప్ ఫైనల్ పోరులో గుకేష్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ ప్రయత్నించారు. కానీ అతడి ట్రాప్‌లో గుకేష్ పడలేదు. అందుకు కారణం ప్యాడీ ఆప్టన్. గుకేష్‌కు ఆయన మెంటల్ కండిషనింగ్ అండ్ స్ట్రాటజిక్ కోచ్‌గా ఉన్నారు. ఆప్టన్ శిక్షణలోనే గుకేష్ అంతలా రాటుదేలారు.