వాటర్ గ్రిడ్‌తో రాష్ట్రంలో ప్రతీ ఎకరాకు సాగునీరు.. సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగం రూపురేఖలను మార్చేలా సమగ్ర 'వాటర్ గ్రిడ్' ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురంలో జరిగిన 'జలధార' కార్యక్రమంలో ప్రకటించారు.

By -  Knakam Karthik
Published on : 6 April 2026 4:39 PM IST

Andrapradesh, CM handrababu, PolavaramProject, AP WaterGrid, Rayalaseema Irrigation, Jaladhara

ఏపీ జల సంకల్పం..2027 నాటికి పోలవరం పూర్తి, రాష్ట్రవ్యాప్తంగా వాటర్ గ్రిడ్!

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగం రూపురేఖలను మార్చేలా సమగ్ర 'వాటర్ గ్రిడ్' ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురంలో జరిగిన 'జలధార' కార్యక్రమంలో ప్రకటించారు. 2027 గోదావరి పుష్కరాల లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, తద్వారా గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా కృష్ణా నదికి తరలించి కృష్ణా డెల్టాతో పాటు విశాఖపట్నం వరకు నీటి సరఫరాను సుస్థిరం చేస్తామని వెల్లడించారు.

సుమారు 200 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జున సాగర్ ఆయకట్టుకు మళ్లించి, శ్రీశైలం నీటిని పూర్తిగా రాయలసీమ అవసరాలకు కేటాయించేలా వ్యూహరచన చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నదుల అనుసంధానం ద్వారా వరద నీటిని కరువు ప్రాంతాలకు చేరవేస్తామని, వంశధార, నాగవళి, వెలిగొండ, చింతలపూడి వంటి పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమీకృత వాటర్ గ్రిడ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Next Story