అకౌంట్లలోకి రూ.20,000.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత అనే చూస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు.
By అంజి
అకౌంట్లలోకి రూ.20,000.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
అమరావతి: అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు, ఆ తర్వాత అనే చూస్తారని సీఎం చంద్రబాబు చెప్పారు. సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి.. ఇలా ప్రతిదానికీ తెలుగుదేశమే ట్రెండ్ సెట్టర్ అని పేర్కొన్నారు. మహానాడులో సీఎం మాట్లాడుతూ.. టీడీపీకి ఒక బ్రాండ్ ఉందని, నీతి, నిజాయితీతో రాజకీయాలు చేస్తామన్నారు. అడిగే పరిస్థితి నుంచి శాసించే స్థాయికి బీసీలను తీసుకొచ్చామన్నారు.
బడగు బలహీన వర్గాలకు అధికారం చూపించామని తెలిపారు. తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పని చేస్తోందని చెప్పారు. పార్టీ కోసం ఎంతోమంది కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశారే తప్ప వెనుకడుగు వేయలేదన్నారు. చంద్రయ్య వంటి వారి స్ఫూర్తి పార్టీని నడిపిస్తోందని అన్నారు. ఆశయం కోసం పోరాటాలు చేసిన వారిని గుర్తుంచుకుంటామన్నారు. టీడీపీ పని అయిపోయిందన్న వాళ్ల కథ ముగిసిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.20 వేల చొప్పున ఇస్తామని కడప మహానాడులో స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుతవ్ం అందించే రూ.6 వేలతో కలిపి మూడు విడతల్లో ఈ ఏడాదే అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు చేస్తామని పేర్కొన్నారు.