అమరావతి: సీఎం, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పార్టీ ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ నెల ఆఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నామినేటెడ్ పదవుల విషయంలో చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. పార్టీలో నిజమైన కష్టసాధకులకు, అంకితభావంతో పనిచేసే వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
తమ పక్కన తిరిగే వారికి కాకుండా పార్టీ కోసం పని చేసే వారిని నామినేటెడ్ పవులకు సూచించాలని ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీ కార్యకర్తలను ప్రొత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.