మెగా డీఎస్సీ -2025.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

డీఎస్సీ - 2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటి పేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు.

By అంజి
Published on : 22 April 2025 6:42 AM IST

CM Chandrababu Naidu, AP government, Mega DSC-2025

మెగా డీఎస్సీ -2025.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

అమరావతి: డీఎస్సీ - 2025 దరఖాస్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కీలక సూచనలు చేశారు. వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికెట్లలో ఉన్న ఇంటి పేరుతోనే అప్లికేషన్ నింపాలని తెలిపారు. ఒక అప్లికేషన్‌లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేసుకోవాలన్నారు. ఫీజు చెల్లించి సబ్మిట్‌ చేశాక సవరణలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే డీఎస్సీకి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఆదివారం ఉదయం 10గంటలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా మధ్యాహ్నానికే 4వేలకు పైగా దరఖాస్తులు అందాయి.

సోమవారం సాయంత్రానికి 21,631 వచ్చాయి. వచ్చే నెల 15 వరకు గడువు ఉన్నప్పటికీ అభ్యర్థులు ఇప్పటినుంచే వేగంగా దరఖాస్తులు సమర్పిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా ఆయన తనయుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్.. ఎక్స్ వేదికగా డీఎస్పీ షెడ్యూలు ప్రకటించారు. 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసినట్టు మంత్రి లోకేష్‌ తెలిపారు.

Next Story