గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన

గ్రామా సచివాలయాల పేరు మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు

By -  Knakam Karthik
Published on : 6 Nov 2025 5:11 PM IST

Andrapradesh, Cm Chandrbabu, village secretariats, Vision Units

గ్రామ సచివాలయాల పేరు మార్చుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన

అమరావతి: గ్రామా సచివాలయాల పేరు మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక నుంచి వాటిని విజన్ యూనిట్స్‌గా పిలుస్తాం అని సీఎం తెలిపారు. సమర్థంగా ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా వాటిని రూపొందిస్తాం..అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆయన అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు...వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరైన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డేటా ఆధారిత పాలనపై సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించాం.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలి. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చుకుని సమర్ధంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందాం. అంతా కలిసి కట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్‌ను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగాం. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది..అని సీఎం మాట్లాడారు.

క్వాంటం కంప్యూటర్‌ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నాం. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నాం. గత ప్రభుత్వ చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నాను. నెలలవారీ, త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచిస్తున్నాను. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉంది. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం.. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోంది. సిటిజెన్ డేటా అంతా క్రోడీకరించాం. అంగన్‌వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలి. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఈ డేటా ద్వారా రియల్ టైమ్‌లోనే అనలటిక్స్ చేసి వాటి ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ప్రిడిక్టివ్ అనలటిక్స్‌కు కూడా టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతోంది. ప్రజల సంక్షేమం కోసం, పాలన కోసం భారీస్థాయిలో బడ్జెట్ వ్యయం చేస్తున్నాం. నిధులు వ్యయం సమర్ధంగా జరగాలి..అని సీఎం చంద్రబాబు సూచించారు.

ప్రస్తుతం ఇ-ఫైల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారన్నదే ప్రశ్న. గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితి అంతా మారిపోవాలి. కేంద్రం తీసుకొచ్చిన డిజి లాకర్‌ను సమర్ధంగా వినియోగించాలి. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలి. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు పోయాయి. శ్రీకాకుళంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటి ప్రమాదం జరిగింది. ఒక సంఘటన తర్వాత ఆయా తప్పులు దిద్దుకోవాల్సి ఉంది. ఓఎస్ఓపీ ఉన్నా దానిని ఎందుకు పాటించలేకపోతున్నాం. పీపుల్స్ పాజిటివ్ పర్సెప్షన్ కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. గత పాలకుల హయాంలో ఎక్సైజ్ లో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. వాటన్నిటినీ సరిచేస్తుంటే మళ్లీ మనపై బ్లేమ్ గేమ్ వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పారదర్శకత పాటించటంతో పాటు దానిని ప్రజలకు కూడా సరిగ్గా చెప్పుకోవాలి. పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలు కూడా డేటా లేక్‌కు అనుసంధానం కావాలి..అని సీఎం చంద్రబాబు సూచించారు.

Next Story