విరాట్ కోహ్లీపై ఆసక్తికర ట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
By Medi Samrat
భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో కీలక పోస్ట్ పెట్టాడు. అందులో "టెస్ట్ క్రికెట్‌లో నేను మొదటిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 సంవత్సరాలు అయ్యింది. నిజాయితీగా చెప్పాలంటే, ఈ ఫార్మాట్ నన్ను ఎలాంటి ప్రయాణంలో తీసుకెళుతుందో నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది. నన్ను తీర్చిదిద్దింది. జీవితాంతం నేను మోయాల్సిన పాఠాలను నేర్పింది. నేను ఈ ఫార్మాట్ నుండి వైదొలగుతున్నప్పుడు. ఇది సులభం కాదు - కానీ అది సరైనదిగా అనిపిస్తుంది. నేను దానికి నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ తిరిగి ఇచ్చింది. నేను కృతజ్ఞతతో నిండిన హృదయంతో వెళ్తున్నాను. నేను ఎల్లప్పుడూ నా టెస్ట్ కెరీర్‌ను చిరునవ్వుతో తిరిగి చూసుకుంటాను" అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై స్పందించారు. టెస్ట్ క్రికెట్ నుండి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ భారత క్రీడలలో ఒక అద్భుతమైన అధ్యాయంగా అభివర్ణించారు. "టెస్ట్ క్రికెట్ నుండి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ భారత క్రీడలలో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని ముగించింది. అతని అభిరుచి, క్రమశిక్షణ, నాయకత్వం లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చాయి, దేశానికి గొప్ప పేరును తెచ్చిపెట్టాయి" అని తెలిపారు. విరాట్ తన కెరీర్‌లో 123 టెస్టు మ్యాచ్‌లు ఆడి.. 9,230 పరుగులు చేశారు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడారు.