ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు.. తొలి, రెండో సంతకం..

ఏపీ సీఎంగా బాధ్యతలను తీసుకున్నారు చంద్రబాబు.

By Srikanth Gundamalla  Published on  13 Jun 2024 11:36 AM GMT
andhra pradesh, cm Chandrababu, first sign,  dsc,

ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు.. తొలి, రెండో సంతకం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత సచివాలయానికి వెళ్లారు. సెక్రటేరియట్‌లోని మొదటి బ్లాక్‌ చాంబర్‌లో ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలను తీసుకున్నారు చంద్రబాబు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు తన తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పైనే చేశారు. ఆ తర్వాత రెండో సంతకం ల్యాండ్‌ అండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై చేశారు. పెన్షన్లను రూ.4వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై సీఎం చంద్రబాబు మూడో సంతకం చేశౄరు. అన్నా క్యాంటీన్లను తాము అధికారంలోకి రాగానే పునరుద్ధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే చంద్రబాబు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్‌ సెన్సెస్‌పై ఐదో సంతకం చేశారు.

కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించాయి. ఏకంగా 165 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సచివాలయానికి వస్తున్న క్రమంలో సీఎం చంద్రబాబుకి ఘనస్వాగతం లభించింది. అమరావతి రాజధాని రైతులు అడుగడుగునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి అభిమానం చాటుకున్నారు.

Next Story