మద్యం బాటిళ్లతో 7వ తరగతి విద్యార్థుల పోజులు.. పోలీసులు ఏం చెప్పారంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని ఒక బాలుర హాస్టల్‌లో నూతన సంవత్సర వేడుకలను చిత్రీకరిస్తున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియో వివాదానికి దారితీసింది.

By అంజి  Published on  4 Jan 2024 3:00 AM GMT
Class 7 students, liquor, Andhra Pradesh

మద్యం బాటిళ్లతో 7వ తరగతి విద్యార్థుల పోజులు.. పోలీసులు ఏం చెప్పారంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని ఒక బాలుర హాస్టల్‌లో నూతన సంవత్సర వేడుకలను చిత్రీకరిస్తున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియో వివాదానికి దారితీసింది. 7వ తరగతి విద్యార్థులు మద్యం బాటిళ్లతో సంబరాలు చేసుకుంటున్నట్లు వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో రీల్ కోసం చిత్రీకరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. తొలి వాదనలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని అనకాపల్లి పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కేవీ మురళీకృష్ణ వెల్లడించారు.

మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరోపించిన వేడుకలో విద్యార్థులు ఎలాంటి మద్యం లేదా డ్రగ్స్ తీసుకోలేదు. హాస్టల్‌ పక్కనే నివాసం ఉంటున్న ఏసీ మెకానిక్‌, కారు డ్రైవర్‌ మద్యం సేవించినట్లు అధికారి తెలిపారు. విద్యార్థులు మద్యం, డ్రగ్స్‌ తీసుకోలేదని, హాస్టల్‌ పక్కనే ఉంటున్న ఏసీ మెకానిక్‌, ఓ కారు డ్రైవర్‌ మద్యం సేవించారని, విద్యార్థులు రీల్‌ తయారు చేయాలనే వీడియో తీశారని, ఈ ఘటన ప్రాథమిక పరిశీలనలో తేలిందని మురళీకృష్ణ తెలిపారు. ఆ స్థలంలో కూర్చుని విద్యార్థులు బిర్యానీ తింటున్నప్పుడు వీడియో చిత్రీకరించారు.

డిసెంబర్ 31న ఈ ఘటన జరిగిందని, వీడియోను మెకానిక్ చిత్రీకరించాడని పోలీసులు తెలిపారు. “సంఘటన ప్రదేశం హాస్టల్ కాదు, హాస్టల్ ప్రక్కనే నిర్మాణంలో ఉన్న భవనం. హాస్టల్ మేనేజ్‌మెంట్‌పై అడ్మినిస్ట్రేటివ్ చర్యలు తీసుకోబడ్డాయి. ఇప్పుడు మేము వీడియోను ధృవీకరిస్తున్నాము ”అని మురళీకృష్ణ చెప్పారు. ఇంకా ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

Next Story