జనసేనలో చేరిన జానీ మాస్టర్
ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ జనసేన
By Medi Samrat Published on 24 Jan 2024 7:45 PM ISTప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ మాస్టర్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్ జనసేనానికి ఖురాన్ ను బహూకరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ గత కొన్నిరోజులుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది.. అలాగే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన నేడు జనసేనలో చేరారు.
పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్ ఎన్నికల వేళ జనసేన పార్టీలో చేరారు. జానీ మాస్టర్ ఎక్కడ నుండి పోటీ చేస్తారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన జానీ మాస్టర్ ఆ జిల్లాలోని ఏదో ఒక స్థానం నుండి బరిలో ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ తరుఫున స్టార్ క్యాంపెయినర్‌గా జానీ మాస్టర్ పని చేస్తారని సైతం ప్రచారం జరుగుతోంది.
Next Story