చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తుంబవారిపల్లిలో భూమి నుండి వింత శబ్దాలు వినబడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు భయంతో అక్కడి నుండి పరుగులు తీశారు. ఎం జరుగుతుందో తెలియక రాత్రంతా ఇళ్ల బయటే కూర్చొని జాగరం చేశారు. భూప్రకంపనలు వచ్చాయని ప్రజలు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఈ భూమి లోపలి నుండి వస్తున్న వింత శబ్దాలను అధికారులు అవి గుర్తించారు. అది భూకంపం కాదని తేల్చారు. తుంబవారిపల్లి గ్రామం రెండు ఎత్తైన కొండల మధ్య ఉంది.
దీనికి తోడుగుగా గతంలో ఇక్కడ వందల సంఖ్యలో నీటి కోసం బోర్లు వేశారు. ఆ బోర్లలో నీళ్లు పడకపోవడంతో ఖాళీగా ఉన్న ఆ బోర్లలో భారీ వర్షాల కారణంగా వరద అంతా చేరింది. దీంతో భూమి నుండి వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి తోడుగా భూమి లోపల ఖాళీ పొరలు ఏర్పడ్డాయని, ఇప్పుడు వాటిలో వరద నీరు చేరుతుండడంతో వింత శబ్దాలు వస్తున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తామని స్థానిక అధికారులు తెలిపారు.