విచార‌ణ సాగ‌దీసేందుకే ఇంప్లీడ్ పిటిష‌న్‌లు వేస్తున్నారా

Chintamani Natakam Ban hearing in AP High court.చింతామ‌ణి నాట‌కం నిషేదాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Feb 2022 3:22 PM IST
విచార‌ణ సాగ‌దీసేందుకే ఇంప్లీడ్ పిటిష‌న్‌లు వేస్తున్నారా

చింతామ‌ణి నాట‌కం నిషేదాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్‌పై ఈ రోజు(బుధ‌వారం) ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ పై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. మ‌రోవైపు నిషేధాన్ని సమర్థిస్తూ ఆర్యవైశ్య సంఘాల తరఫున మూడు ఇంప్లీడ్ పిటిషన్‌లను దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్లూ ధ‌ర్మాస‌నం ముందుకు విచార‌ణకు వ‌చ్చాయి. కాగా.. ఇంప్లీడ్ పిటిష‌న్‌ల‌పై హైకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. విచార‌ణ సాగ‌దీసేందుకే ఇంప్లీడ్ పిటిష‌న్లు వేస్తున్నారా అని ప్ర‌శ్నించింది.

సీనియ‌ర్ న్యాయవాది వేదుల వెంకటరమణ ఇంప్లీడ్ పిటిష‌న్‌కు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. అభ్యంత‌రం ఉన్న పాత్ర‌నే నిషేదించాల‌ని కోరుతున్న‌ట్లు న్యాయవాది ఉమేష్ చంద్ర తెలిపారు. మొత్తం నాట‌కాన్ని ఎలా నిషేదిస్తార‌ని వాద‌నలు వినిపించారు. వందేళ్ల నుంచి ప్ర‌ద‌ర్శిస్తున్న నాట‌కాన్ని ఎలా నిషేదిస్తారన్నారు. రామాయణంలో అభ్యంతరకర పాత్రలు ఉన్నాయంటే నిషేధిస్తారా అని ప్ర‌శ్నించారు. ఇక ఆర్టిస్టుల తరుపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ కూడా సీజె బెంచ్ కి బదిలీ చేశారు. వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

Next Story