ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజక వర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూ ఉంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చట్టం ప్రకారం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, కావాలని గొడవ చేస్తే చూస్తూ ఊరుకోనే పరిస్థితి లేదని చింతమనేని వార్నింగ్ ఇచ్చారు. నేను బరస్ట్ అయిన మాట వాస్తవమే అని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
బుధవారం రాత్రి వట్లూరులో వివాహానికి హాజరైన చింతమనేని కారుకి అడ్డంగా మరొకరు కారు నిలపడంతో వాగ్వివాదం మొదలైంది. ఎమ్మెల్యే బూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. దెందులూరు నియోజక వర్గంలో విధ్వంస పాలన కొనసాగుతూ ఉందని అబ్బయ్య చౌదరి అన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై చింతమనేని ప్రభాకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.