రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస

75 సెంట్లలో 52 రకాల పంటలు సాగు చేస్తోన్న గుంటూరు జిల్లా, అత్తోటకు చెందిన రైతు రోశయ్యను సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసించారు.

By -  Medi Samrat
Published on : 13 March 2026 2:56 PM IST

రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంస

75 సెంట్లలో 52 రకాల పంటలు సాగు చేస్తోన్న గుంటూరు జిల్లా, అత్తోటకు చెందిన రైతు రోశయ్యను సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసించారు. ఈ మేర‌కు ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు రోశయ్యకు ప్రణామాలు అంటూ ఎక్స్‌లో సీఎం ఒక పోస్టు చేశారు. ఆ పోస్టులో.. భూమిని తల్లిలా భావించి.. ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతు రోశయ్యకి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ.. నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య విజయగాధ స్ఫూర్తిదాయకం. 2016లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నాడు తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది ప్రకృతి సాగు మొదలు పెట్టిన రోశయ్య సాధిస్తున్న విజయాలు ఆదర్శం అని పేర్కొంటూ రోశయ్యకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Next Story