ఈదుపురంలో 'దీపం' వెలుగులు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.O పథకానికి శ్రీకారం చుట్టారు.

By Kalasani Durgapraveen  Published on  1 Nov 2024 1:11 PM GMT
ఈదుపురంలో దీపం వెలుగులు

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.O పథకానికి శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం మూడు 12.45 నిమిషాలకు హెలికాప్టర్లో ఆయన ఈదుపురం చేరుకున్నారు. అక్కడ సుమారు అరగంట పైన సీనియర్ నాయకులతో సమీక్ష చేశారు. అనంతరం రోడ్డు మార్గం గుండా కిలోమీటర్ దూరంలో ఉన్న ఈదుపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్యాస్ సిలిండర్ల వాహనాలకు జెండా ఊపి, కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దీపం పథకం లబ్ధిదారురాలైన అంబటి శాంతమ్మ గృహానికి చేరుకుని, ఆమెకు తొలి సిలిండర్ ను పంపిణీ చేశారు. అనంతరం ఆమెకు కుశల ప్రశ్నలు వేసి, నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాన్ని తీసుకున్నారు. శాంతమ్మ ఇంట్లో స్వయంగా ఆయనే టీ తయారు చేసి వారితో టి తాగుతూ మాట్లాడారు. ఆయన చేతుల తోనే గ్యాస్ వెలిగించి, గిన్నె పెట్టి పాలను అందులో కాచి, టీ పొడి, పంచదార వేసి, గరిటతో కలియతిప్పి స్వయంగా చంద్రబాబు టీ తయారు చేయడంతో ఆ ఇంటి వారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు.

ప్రభుత్వo ఏర్పడిన 143 రోజులుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల ఆయన పలువురి నుంచి అభిప్రాయాన్ని తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ఒంటరి మహిళ లబ్ధిదారు రాలైన బలిజేపల్లి జానకి గృహానికి చేరుకొని ఆమెకు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ రూ.4 వెలను స్వయంగా తన చేతుల మీదగా ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడారు. జానకి కుటుంబ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఒంటరి మహిళ పింఛన్ వల్ల తన లాంటి లక్షలాదిమందికి ఎంతో మేలు జరుగుతున్నట్లు జానకి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి తన ఇంటికి రావడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి కష్టం కలిగినా తాను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకుంటారని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

దీపం పథకం ప్రారంభోత్సవంలో భాగంగా అంతకు మునుపు ఈదుపురం హెలిప్యాడ్ వద్దకు. షెడ్యూల్ ప్రకారమే 12.45 సమయానికి చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికార యంత్రాంగం ఘనంగా స్వాగత ఏర్పాట్లను చేసింది. ఈ దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్, జల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్టీవో ఎం కృష్ణమూర్తి, శాసనసభ్యులు కూన రవికుమార్, గౌతు శిరీష, ఎన్.ఈశ్వరరావు, పలువురు కూటమి నాయకులు పూల బొకేలను ఇచ్చి ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్ వద్ద కాసేపు నాయకులు అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు.


Next Story