మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే..! ఈ పరాజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ కష్టపడ్డారని చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్నిచోట్ల ప్రాణాలు కూడా పణంగా పెట్టారని తెలిపారు. టీడీపీ శ్రేణుల పోరాట స్ఫూర్తికి ఆయన వందనాలని.. ఫలితాలను చూసి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని చెప్పారు. రౌడీయిజం, బెదిరింపులు, అధికార దుర్వినియోగం ప్రలోభాలు ఉన్నప్పటికీ గట్టిగా పోరాడామని చంద్రబాబు చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు కొనసాగుదామన్నారు.

ప్రస్తుత ఫలితాలు చూసి నిరుత్సాహపడనక్కర్లేదని కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు తొలగించే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలని కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని.. కొన్నిచోట్ల ప్రాణాలు పణంగా పెట్టి పార్టీకి అండగా నిలిచారని కొనియాడారు. అధికార దుర్వినియోగం, ప్రలోభాలు ఉన్నా గట్టిగా పోరాడామని వెల్లడించారు. ప్రజాసమస్యల పరిష్కారం, రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా సాగుదామని పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తే రాబోయే రోజుల్లో విజయం మనదే అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తోట‌ వంశీ కుమార్‌

Next Story