ఆదుకోవాల్సిన ప్రభుత్వమే.. చేతకాదంటూ చేతులెత్తేసింది: చంద్రబాబు

Chandrababu Fire on CM Jagan's visit to flood affected areas. వరద బాధితుల్ని ఆదుకోవాల్సిన వైసీపీ ప్రభుత్వం చేతకాదంటూ.. చేతులెత్తేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు

By అంజి  Published on  28 July 2022 9:07 PM IST
ఆదుకోవాల్సిన ప్రభుత్వమే.. చేతకాదంటూ చేతులెత్తేసింది: చంద్రబాబు

వరద బాధితుల్ని ఆదుకోవాల్సిన వైసీపీ ప్రభుత్వం చేతకాదంటూ.. చేతులెత్తేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని బొండ్లబోరు, శివకాశీపురం గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కష్టాల్లో ఉంటే పాదయాత్ర చేసిన జగన్‌.. ప్రజలకు కష్టం వస్తే గోదాట్లో ముంచేశాడని ఫైర్‌ అయ్యారు. పోలవరం నిర్వాసితులకు రూ.2 వేల కోట్ల పరిహారమైతే ఇస్తానని, పెద్ద మొత్తం కాబట్టే ఇవ్వలేకపోతున్నానని జగన్‌ చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు.

వారం రోజుల కిందట తాను వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాకే.. విధిలేని పరిస్థితుల్లో జగన్ పర్యటించారని విమర్శించారు. ఇప్పుడైనా వెళ్లకపోతే ప్రజలు మీదబడతారెమోనన్న భయంతో నిన్న జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారన్నారు. బారికేడ్లు, పరదాల చాటునే సీఎం జగన్ పర్యటన సాగిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌కు ప్రజా సమస్యలు పట్టవా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 వేలు వరద బురద కడిగేందుకు కూడా సరిపోవన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారు.

టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం ముంపు ప్రాంతాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలవరం నిర్వాసితులను కచ్చితంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తన హయాంలో కట్టించిన ఆశ్రమ పాఠశాలే ఇప్పుడు వరద బాధితులకు సహాయ శిబిరంగా మారిందన్నారు.

Next Story