కొత్తగా ఏడు ఈఎస్‌ఐ ఆసుపత్రుల మంజూరు..!

Centre Approves 7 New ESI Hospitals In AP.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్ర‌ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 22 March 2022 11:52 AM IST

కొత్తగా ఏడు ఈఎస్‌ఐ ఆసుపత్రుల మంజూరు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్ర‌ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి ఏడు నూత‌న ఈఎస్ఐ ఆస్ప‌త్రుల‌ను మంజూరు చేసింది. పార్ల‌మెంట్‌లో సోమ‌వారం భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త ఈఎస్ఐ ఆస్ప‌త్రుల వివ‌రాల గురించి కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించగా ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో భాగంగా సీపీడబ్ల్యూడీ శాఖతో విశాఖలో రూ.384.26 కోట్లతో, MECON కంపెనీ ఆధ్వర్యంలో రూ.73.68 కేంద్ర నిధుల‌తో విజయనగరంలో, రూ.102.77 కోట్ల కేంద్ర నిధుల కేటాయింపుతో సీపీడబ్ల్యూడీ శాఖ సహకారంతో కాకినాడలో కొత్త ఈఎస్ఐ ఆస్ప‌త్రుల నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు.

గుంటూరు, పెనుకొండ, విశాఖ, అచ్యుతాపురం, నెల్లూరు శ్రీ సిటీలకు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులు మంజూరు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం అవి భూసేక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించింది. వీటితో పాటు రాజమండ్రి, విశాఖలోని మల్కీపురంలో ఈఎస్‌ఐ ఆసుపత్రులు పుననిర్మాణంలో ఉన్నాయని, విజయవాడలో కూడా సీపీడబ్ల్యూడీ శాఖకు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం బాధ్యతలు అప్పజెప్పారని కేంద్రం తెలిపింది.

Next Story