ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా ఏడు ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు పరిశీలన చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

By అంజి  Published on  28 Aug 2024 1:05 AM GMT
Central Minister Rammohan Naidu, New Airports, AndhraPradesh

ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా ఏడు ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించేందుకు పరిశీలన చేస్తున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్‌, కుప్పం, ఒంగోలు/ నెల్లూరు, అనంతపురంలో విమానాశ్రయాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే విజయవాడ - శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన డెమో అక్టోబర్‌లో నిర్వహిస్తామని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

గతంలోనూ సీ ప్లేన్ కార్యకలాపాలపై ప్రయత్నాలు జరిగినా నిబంధనలు ఇబ్బంది కారణంగా మధ్యలోనే ఆగిపోయిందన్నారు. సీ ప్లేన్ కేవలం పర్యాటకం కోసమే కాకుండా వైద్య, పౌర రవాణాకు ఉపయోగపడేలా నిబంధనలు సడలిస్తున్నామని చెప్పారు. అటు ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని తెలిపారు. రిపోర్ట్‌ అందిన తర్వాతే దానిపై మాట్లాడతానని రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Next Story