శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Central Minister Kishan Reddy visits Tirumala.కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి
By తోట వంశీ కుమార్ Published on 19 Aug 2021 12:42 PM ISTకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం చేయగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో అరికట్టాల్సిందిగా స్వామివారిని ప్రార్ధించినట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందినట్లు ఆయన వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ది జగరడం లేదన్నారు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు పర్కిషంచుకోవాలన్నారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్రం భావన.
కరోనా సమయంలో ఏపీకి 4500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపింది. రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలను మంజూరు చేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ది చేసింది. దేఖో అప్పా దేశ్ పేరుతో పర్యాటకరంగ అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే జనవరి నుంచి డిసెంబర్ వరకు పర్యాటభివృద్దికి ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా మూడో దశ రాకుండా అడ్డుకోగలమన్నారు. రాష్ట్రాల పర్యటన సందర్భంగా వైద్యులను కలిసి భరోసా ఇస్తామన్నారు. దేశంలో అందరికి ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామన్నారు.