ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రభుత్వం గుడ్‌న్యూస్
ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నగరవనాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధి కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నగరవనాల ఏర్పాటు కోసం కేంద్రం ర.15.4 కోట్లు మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. పెనుకొండలోనూ నగరవనాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నెల్లిమర్ల, కదిరి, కాశీబుగ్గలో కూడా కేంద్ర నిధుల సాయంతో నగరవనాలు ఏర్పాటు చేయనున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు.
మరోవైపు నగరవనాల ఏర్పాటుపై అధికారులతో పవన్ కల్యాణ్ చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 నగరవనాలను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు.. పవన్ కళ్యాణ్‌కు వివరించారు. వచ్చే వందే రోజుల్లోనే 30 నగరవనాలను పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన నిధులను నగరవనాల అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. ఇదే సమయంలో ఆగస్ట్ 30వ తేదీ ఏపీవ్యాప్తంగా వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వనమహోత్సవం కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేయాలని సూచించిన పవన్ కళ్యాణ్.. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊర్లో మొక్కలు నాటాలని సూచించారు.