విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం

CBSE syllabus in AP govt schools.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో సీబీఎస్​ఈ సిలబస్ ను ప్ర‌వేశ పెడుతున్న ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 May 2021 6:26 AM GMT
CBSE syllabus in AP Schools

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. మారుతున్న విద్యా విధానాల‌కు అనుగుణంగా మార్పులు తెచ్చి రాష్ట్ర విద్యార్థులు అన్ని పోటీ ప‌రీక్ష‌ల్లో పోటీ ప‌డేలా అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో సీబీఎస్​ఈ(సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) సిలబస్ ను ప్ర‌వేశ పెడుతున్న ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తరఫున రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25 సంవ‌త్స‌రంలో ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేప‌ట్ట‌నుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 61,208 పాఠశాలలు ఉండగా 44,639 (73 శాతం) ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో 43 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ రెండేళ్లలో 6,13,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరార‌ని విద్యాశాఖ‌ తెలిపింది. ఇందులో నాలుగు లక్షల మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన వారే ఉండ‌టం గ‌మ‌నార్హం. సీబీఎస్‌ఈలో దేశంలోని విద్యా సంస్థలతో పాటు 26 దేశాల్లోని 25 వేలకు పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయని.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల‌ను అన్నింటిని దశల వారీగా బోర్డుకు అనుసంధానించేందుకు ప్రభుత్వం సహకారం అందించ‌నుంద‌ని చెప్పింది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఇంగ్లీషు మీడియంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తామ‌ని చెప్పింది. మూడు, అయిదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయ‌త్త‌మ‌వుతుంది.




Next Story