ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ దర్యాప్తు పూర్తయిందని సీబీఐ తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అధికారికంగా వెల్లడించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా ముందుకువెళతామని తెలిపింది. వివేకా హత్య కేసులో ఇంకా విచారించాల్సిందేమీ లేదు. మా తరపు నుంచి దర్యాప్తు ముగిసింది. దర్యాప్తుపై కోర్టు ఏమైనా ఆదేశాలిస్తే వాటిని అమలు చేస్తాం..అని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది.
దీంతో జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం మరోసారి ఈ కేసును విచారించనుందని సమాచారం. వివేకా కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ వేరే కోర్టులో ఉన్నందువల్ల విచారణను జూనియర్ లాయర్ పాస్ ఓవర్ కోరినట్లు సమాచారం.