మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచార‌ణ 94 వ రోజు కొన‌సాగుతోంది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో ఈ రోజు కూడా అధికారులు పలువురిని విచారిస్తున్నారు. నేడు వివేకా సోద‌రుడు వైఎస్ సుదీక‌ర్ రెడ్డి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. వివేకా హత్యకు ముందు కుటుంబ విషయాలపై సుధీకర్ రెడ్డిని సీబీఐ అధికారులు క్షుణ్ణంగా అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అనుమానితులతో పాటు వైఎస్‌ కుటుంబ సభ్యులను కూడా సీబీఐ అధికారులు విచారించారు. ఈ కేసు గురించి మరింత సమాచారం సేకరించడంలో భాగంగా సుధీకర్‌ రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story