ఎంపీ రామ్మోహన్‌ నాయుడిపై కేసు నమోదు

Case Filed Against TDP MP Rammohan Naidu. టీడీపీ ఆంధ్రప్ర‌దేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడిపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో

By Medi Samrat  Published on  3 Nov 2021 6:21 AM GMT
ఎంపీ రామ్మోహన్‌ నాయుడిపై కేసు నమోదు

టీడీపీ ఆంధ్రప్ర‌దేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌ నాయుడిపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు న‌మోద‌యింది. అంతేకాకుండా 48 మంది టీడీపీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్య‌క్ర‌మాన్ని టీడీపీ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా ఆ ప్రాంతంలో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ర్యాలీ నిర్వ‌హించారు. క‌రోనా వేళ వారు నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని, అలాగే, మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించార‌ని వీఆర్వో ఆరంగి మల్లేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసిన టెక్క‌లి పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాలను వీరు ఆవిష్కరించారు. దీంతో కరోనా నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా వీరితో పాటు ఈ కార్యక్రమానికి ర్యాలీగా వచ్చిన పలువురు టీడీపీ కార్యకర్తలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.టీడీపీ ర్యాలీ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు కరోనా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమే కాకుండా మోటార్ వాహన చట్టాన్ని కూడా అతిక్రమించారని వీఆర్వో ఆరంగి మహేశ్వరరావు టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


Next Story