తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్ రోడ్డులో కొండపైకి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. మూల మలుపును డ్రైవర్ గమనించకపోవడంతో కారు అదుపు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులు గాయపడ్డారు. గాయపడిన భక్తులను తిరుమలలోని అశ్వని ఆసుపత్రికి తరలించారు. ఘాట్ రోడ్‌లో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని పలు హెచ్చరికలు జారీ చేశారు.