ప్రయాణికులకు అలర్ట్‌.. నేడు, రేపు పలు రైళ్లు రద్దు

ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ అప్రమత్తమైంది. దీంతో రైలు ట్రాక్‌ల నిర్వహణపై రైల్వే

By అంజి  Published on  21 Jun 2023 5:18 AM GMT
trains Cancellation, South Central Railway, Vizag

ప్రయాణికులకు అలర్ట్‌.. నేడు, రేపు పలు రైళ్లు రద్దు

ఇటీవల కాలంలో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ అప్రమత్తమైంది. దీంతో రైలు ట్రాక్‌ల నిర్వహణపై రైల్వే అధికారులు దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు.. రైల్వే ప్రయాణికులకు కీలక సూచన జారీ చేశారు. భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి మాట్లాడుతూ.. బుధవారం.. పుదుచ్చేరి-హావ్‌డా (12868), షాలిమార్‌-హైదరాబాద్‌ (18045), హైదరాబాద్‌-షాలిమార్‌ (18046) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-షాలిమార్‌ (22854), షాలిమార్‌-సికింద్రాబాద్‌ (12773), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-షాలిమార్‌ (22826), హావ్‌డా-సత్యసాయి ప్రశాంతి నిలయం (22831), తాంబరం-సంత్రాగచ్చి (22842), షాలిమార్‌-సికింద్రాబాద్‌ (22849), గురువారం.. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-సంత్రాగచ్చి (22808), ఎస్‌ఎంవీ బెంగళూరు-హావ్‌డా (22888) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు గుర్తించి.. తగిన విధంగా ప్రయాణానికి ప్లాన్‌ చేసుకోవాలని అభ్యర్థించారు.

విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్లలో ఈ నెల 25 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైలు నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 19 నుంచి 26 వరకు రద్దు చేయబడింది. విశాఖపట్నం - గుంటూరు సింహాద్రి ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెం. 17240) ఈ నెల 20 - 26 వరకు, విజయవాడ - తెనాలి (07629) రైలు ఈ నెల 21న, తెనాలి - రేపల్లె (07874), రేపల్లె - తెనాలి (07875) రైళ్లను ఈ నెల 22న రద్దు చేశారు. ఈ నెల 24న విజయవాడ - గుంటూరు (07783) మధ్య నడిచే రైలును రద్దు చేశారు. ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. వీటితో పాటు రద్దు చేసిన వాటిలో సికింద్రాబాద్-వికారాబాద్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడి-కాచిగూడ - కాజీపేట-డోర్నకల్-కాజీపేట, భద్రాచలం రోడ్-విజయవాడ-భద్రాచలం రోడ్, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, కరీంనగర్-నిజాం తదితర రైళ్లు ఉన్నాయి.

Next Story