ఈ ప్రపంచంలో నిత్యం ఎక్కడో ఒక చోట వింతలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. అందులో మనకు తెలిసేవి చాలా తక్కువ. మూడు కాళ్ల ఆవులు, రెండు తలల దూడెలు ఇలా పుడుతూనే ఉంటాయి. ఇక 2020లో ఎప్పుడూ చూడని వింత వింత సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కలియుగం అంతం కాబోయే ముందు ఇలాంటి జరుగుతాయని.. భయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో వింత ఘటన జరిగింది.
పిఠాపురం మండలం రామపర్తి గ్రామానికి చెందిన సూరారెడ్డి అనే రైతు ఇంట్లో ఆరు కాళ్లతో వింత దూడ జన్మించింది. ప్రతి రెండు కాళ్లకు మధ్యలో మరొక కాలు ఉండడంతో మొత్తం ఆరు కాళ్లతో జన్మించింది. సాధారణంగా గేదెలకు నాలుగు కాళ్లే ఉంటాయి. విషయం ఆ నోటా ఈనోటా ఊరంతా తెలియడంతో.. ఆ వింత దూడను చూసేందుకు జనాలు పరుగులు పెడుతున్నారు. ఈ ఘటనపై పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించగా.. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి దూడలు జన్మిస్తాయన్నారు. చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందని.. ఇలా జన్మించిన దూడలు త్వరగా చనిపోయే అవకాశముందన్నారు.