అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి అన్నదమ్ములు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురంలోని ఓ మామిడి తోటలో పని నిమిత్తం నాగేంద్ర, చరణ్‌లు కూలీలుగా వెళ్లారు.
అయితే అదే తోటలోని నీటి సంపులో నీరు త్రాగేందుకు వెళ్లిన ప్రమాదవశాత్తూ అందులో పడి మృతి చెందారు. మొదట కాలుజారిపడిన నాగేంద్రను రక్షించేందుకు దిగిన చరణ్ కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. తమ్ముడిని కాపాడాలనుకుని నీటిలోకి దిగిన అన్న కూడా మృతి చెందాడు.