ఏపీలో పంచాయతీ ఎన్నిక నేపథ్యం రాజకీయం వేడెక్కుతోంది. ఏకగ్రీవాలతో పాటు మిగిలిన పంచాయతీల్లో అభ్యర్థుల గెలుపు ఓటములు మంగళవారం తేలిపోనుంది. తొలి విడత 141 పంచాయతీల్లో పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు, ఉప సర్పంచ్‌ల ఎన్నిక అన్ని మంగళవారం తేలిపోనుంది. కాగా, ఈ ఎన్నికల్లో తోడబుట్టిన అక్కచెల్లెల్లు బరిలో దిగడం ఆసక్తికరంగా మారింది.

ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలోని కంకరముర్రు గ్రామంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఎస్సీ మహిళాకు రిజర్వు అయింది. దీంతో ఇరు వర్గాల వారు ఇద్దరు అక్కా, చెల్లెళ్లను ఎంపిక చేశారు. ఒక వర్గానికి చెందిన వారు అక్క ఈదర రాజకుమారిని రంగంలో దింపితే, మరో వర్గం వారు ఆమె చెల్లెలు ఈదర సౌందర్యను బదిలోకి దింపారు. దీంతో అక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఇద్దరు ఇప్పటికే హోరాహోరీగా ప్రచారాలు కూడా నిర్వహించుకున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు కొండపి మండలం మిట్టపాలెంలో సర్పంచ్‌ స్థానానికి అన్నదమ్ములు బరిలోకి దిగారు. గ్రామంలో సర్పంచ్‌ స్థానం ఎస్సీకి రిజర్వ్‌ కావడంతో ఆదివారం అన్నదమ్ములు నామినేషన్‌ వేశారు. ఇప్పుడు ఈ అక్కా చెల్లెళ్లు, అన్నతమ్ముళ్లు ఎవరు గెలుస్తారన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.

కాగా, ఎన్నో వివాదాలు, ఎన్నో విమర్శల మధ్య పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే సవాళ్లు, ప్రతిసవాళ్లతో గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయాలు అట్టుడుకున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నేడు తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్‌ తర్వాత పోలింగ్‌ జరగనుంది.

మంగళవారం మొత్తం 3,249 పంచాయతీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఇప్పటికే 525 పంచాయతీలు ఏగ్రీవం అయ్యాయి. మిగిలిన 2723 స్థానాలకు 7506 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 32,502 వార్డ్ మెంబర్లకు గాను 12,185 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని అధికారులు వెల్లడించారు.


సామ్రాట్

Next Story