అనంత‌పురం జిల్లాలో పెళ్లైన రెండోరోజే భ‌ర్త‌కు షాకిచ్చిన భార్య.. నగ‌ల‌తో జంప్‌‌

Bride escape with jewelry and cash.భ‌ర్త ఇంటిలో ఉన్న న‌గ‌దు, న‌గ‌లు తీసుకుని ప్రియుడితో క‌లిసి పరారైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2021 10:41 AM IST
Bride escape with jewelry in Anantapur

అనారోగ్యంతో భార్య చ‌నిపోగా.. ఇద్ద‌రు పిల్ల‌ల సంర‌క్ష‌ణ కొర‌కు పెద్ద‌ల సాక్షిగా రెండో పెళ్లి చేసుకున్నాడు. వివాహం జ‌రిగిన రెండో రోజు కాపురానికి వ‌చ్చిన భార్య.. భ‌ర్త ఇంటిలో ఉన్న న‌గ‌దు, న‌గ‌లు తీసుకుని ప్రియుడితో క‌లిసి పరారైంది. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. అనంత‌పురం జిల్లా పెద్ద‌ప‌ప్పూరు మండ‌లం క‌మ్మ‌వారి ప‌ల్లి గ్రామంలో ప‌య్యావుల కేశ‌వ ముర‌ళి త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అయితే.. అత‌డి భార్య అనారోగ్యంతో ఆరు నెల‌ల క్రితం మృతి చెందింది.

ఇత‌డికి ఇద్ద‌రు పిల్ల‌లు. వారి సంరక్షణ కోస‌మ‌ని ఫిబ్ర‌వ‌రి 28న నల్లమాడ మండలం శ్రీరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను పెద్ద‌ల సాక్షిగా పెళ్లిచేసుకున్నాడు. వివాహాం అనంత‌రం మ‌రుస‌టి రోజు భ‌ర్త ఇంటికి కాపురానికి వ‌చ్చింది భార్య. అదునుచూసుకుని ఇంట్లో ఉన్న మూడు తులాల బంగారు న‌గ‌లు, రూ.80వేల న‌గ‌దు తీసుకుని పారిపోయింది. భార్య .. ప్రియుడితో క‌లిసి ఒడిశాలో ఉన్న‌ట్లు తెలుసుకుని కేశ‌వ బుధ‌వారం పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story