చిలకలూరిపేటలో కిడ్నాప్‌ కలకలం.. బాలుడిని రక్షించిన పోలీసులు

Boy kidnapped from Chilakaluripet for Rs 1 crore left in Nellore. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కిడ్నాప్‌కు గురైన బాలుడిని దుండగులు కారుతో సహా ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా

By అంజి  Published on  3 Oct 2022 1:10 PM IST
చిలకలూరిపేటలో కిడ్నాప్‌ కలకలం.. బాలుడిని రక్షించిన పోలీసులు

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కిడ్నాప్‌కు గురైన బాలుడిని దుండగులు కారుతో సహా ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా కావలి సమీపంలో వదిలేశారు. పోలీసులు బాలుడిని చిలకలూరిపేటకు తీసుకువస్తున్నారు. కిడ్నాపర్లు బాలుడిని వదిలేసి వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్ సాయి అనే బాలుడు దసరా సెలవుల కోసం చెన్నై నుంచి కుటుంబ సమేతంగా చిలకలూరిపేటకు వచ్చాడు. అతని తండ్రి బియ్యం వ్యాపారి. ఆదివారం ఉదయం చిలకలూరిపేటలోని 13వ వార్డులో గల ఆలయాన్ని తల్లిదండ్రులు, రాజీవ్‌సాయి సందర్శించారు.

తల్లిదండ్రులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా, ఆలయ ఆవరణలో ఆడుకుంటున్న రాజీవ్ సాయిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బాలుడిని విడుదల చేసేందుకు కోటి రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. రాజీవ్ సాయి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించారు. కిడ్నాపర్లు బాలుడికి ఎలాంటి హాని చేయకుండా వదిలేయడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చిలకలూరిపేటలో కిడ్నాప్ వార్త సంచలనం సృష్టించింది.

Next Story