జనసేనలోకి బొత్స సోదరుడు లక్ష్మణరావు?

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడుతుండటంతో.. వైసీపీకి షాక్‌ల షాక్‌లు తలుగుతున్నాయి.

By అంజి  Published on  25 Sept 2024 11:40 AM IST
Botsa Satyanarayana, Lakshmana Rao, Janasena party, APnews

జనసేనలోకి బొత్స సోదరుడు లక్ష్మణరావు?

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడుతుండటంతో.. వైసీపీకి షాక్‌ల షాక్‌లు తలుగుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరనున్నట్టు సమాచారం. వచ్చే నెల 3వ తేదీన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారని తెలిసింది. ఇప్పటికే నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవితో ఆయన భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై వీరిద్దరూ చర్చించుకున్నారు.

లక్ష్మణరావుతో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా జనసేనలో చేరనున్నారు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో కూడా ల‌క్ష్మ‌ణ‌రావు ఎన్డీఏ కూట‌మి విజ‌యానికి కృషిచేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల ఎమ్మెలై టికెట్ కోసం ఇప్పటి నుండే ల‌క్ష్మ‌ణరావు వ్యూహాలు రచిస్తున్నట్లు స‌మాచారం. అటు బొత్స అనుచరులు.. వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన ఉండటంతో అందులో చేరుతున్నారు. బొత్స అనుచరులు వలసలు మున్ముందు విజయనగరం జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులను సూచిస్తున్నాయంటున్నారు.

Next Story